ఆడంబరాలకు దూరంగా.. రిజిస్టర్ మ్యారేజ్ తో ఒక్కటైన ఐఏఎస్-ఐపీఎస్ జంట!
ఆడంబరాలకు దూరంగా.. రిజిస్టర్ మ్యారేజ్ తో ఒక్కటైన ఐఏఎస్-ఐపీఎస్ జంట! భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి 24(ప్రజాక్షేత్రం):ఉన్నత ప్రభుత్వ హోదాల్లో ఉన్నప్పటికీ, ఆడంబరాలకు దూరంగా ఉంటూ ఓ ఐపీఎస్ అధికారిణి, శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి నిరాడంబరంగా వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని లింగారెడ్డిగూడెంకు చెందిన ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, ఏపీలోని కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ శ్రీకాంత్ రెడ్డి శనివారం చట్టబద్ధంగా ఒక్కటయ్యారు. చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్యంత...