నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..

నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..   ఆ పర్యటన వాయిదా వేసుకోవాలన్న సజ్జనార్ హైదరాబాద్ జనవరి 24(ప్రజాక్షేత్రం):నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిష్ పర్యటనను ఈ రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని కోరారు. అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లోని వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు....