పేదల అసైన్డ్ భూములు కబ్జా చేసిన ఎక్స్పీరియమ్ పార్క్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్
శంకర్ పల్లి జనవరి 28(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో సర్వేనెంబర్ 305, 306, 334 అసైన్డ్ భూములను సిపిఎం శంకర్ పల్లి మండల కార్యదర్శి బోడ మల్లేష్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ పొద్దుటూరు గ్రామానికి చెందిన ఎరుకల మల్లమ్మ, పెంటయ్య రామచంద్రయ్య, శ్రీనివాసుల భూములను ఈకో ఎక్స్పీరియర్యం పార్క్ యాజమాని రాందేవరావ్ లీజు పేరుతో కబ్జా చేశాడని అన్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా చేసిన లీజు తీసుకొని కమర్షియల్ పర్పస్ ఉపయోగించిన రెవెన్యూ అధికారులు పి ఓ టి చట్ట ప్రకారం ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి కానీ శంకర్ పల్లి ఎమ్మార్వో, ఆర్ఐ తేజ రాందేవ్ రావుకు తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. రైతులు తమ భూములు కబ్జా చేశారు. అని ఎమ్మార్వోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ శంకర్ పల్లి ఎమ్మార్వో సురేందర్ ని ఆర్ ఐ తేజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేద దళితుల భూములు దాదాపు 20 ఎకరాలు కబ్జా చేసిన రాందేవ్ రావు పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శంకర్ పల్లి మండల కార్యదర్శి బోడ మల్లేష్, అశోక్, పాండు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.