ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.

-కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి. రంగారెడ్డి, జనవరి 29(ప్రజాక్షేత్రం):ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడం జరిగినదని, ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని, ఈ కంట్రోల్ రూమ్ లో (24) గంటలు...