మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ముంబాయి జనవరి 28(ప్రజాక్షేత్రం):మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో 5గురు విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బారమతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చార్టెడ్ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ముంబాయిలో నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో పాల్గొన్న ఆయన బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలో జరుగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తన చార్టెడ్ విమానంలో బారమతిలో ఉదయం 8.45 గంటలకు ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చనిపోయారని డీజీసీఏ వెల్లడించింది.