సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సూట్‌కేస్‌ కలకలం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సూట్‌కేస్‌ కలకలం   సికింద్రాబాద్‌, జనవరి 25(ప్రజాక్షేత్రం):సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1పై అనుమానాస్పదంగా కనిపించిన సూట్‌కేస్‌ కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, బాంబ్‌ స్క్వాడ్‌ సూట్‌కేస్‌ను జాగ్రత్తగా తెరిచి పరిశీలించారు. పరిశీలనలో సూట్‌కేస్‌లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని తేలింది. దీంతో పోలీసులు, ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించినందుకు ప్రయాణికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్‌లో భద్రతా...