గద్వాల జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

గద్వాల జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం అయిజ పట్టణంలో రాయచూర్ వెళ్లే మార్గంలో ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది గద్వాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):తెలంగాణలోని గద్వాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయిజ పట్టణంలోని రాయచూర్ వెళ్లే మార్గంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫ్యాక్టరీలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో సిబ్బంది పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో...