చికిత్స పొందుతూ మహిళ మృతి
కుషాయిగూడ, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శారదా బస్ స్టాప్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రమీల రాణి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఫిబ్రవరి 25 రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కారు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆమె భర్త వెంకట్‌రెడ్డికి కాలు విరిగింది. కారు నడిపిన వ్యక్తిని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.