డ్రైనేజీ నిర్మించారు.. పైకప్పు మరిచారు
డ్రైనేజీ నిర్మించారు.. పైకప్పు మరిచారు శంకర్ పల్లి ఫిబ్రవరి 17(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మున్సిపల్ లోని ఫత్తేపూర్ 8వ వార్డు నిర్మించిన డ్రైనేజీ పనులకు సంవత్సరం కాలం పూర్తికావస్తున్నా, ఇప్పటికీ పైకప్పు (స్లాబ్) నిర్మాణం చేపట్టకపోవడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. డ్రైనేజీ నిర్మాణం చేపట్టి పైకప్పు వదిలేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు రోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ పైకప్పు లేకపోవడంతో మురుగునీటి దుర్వాసన వ్యాపించడమే కాకుండా, దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు రాకపోకల్లో...