తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం పంటలకు తీవ్ర నష్టం

హైదరాబాద్, ఫిబ్రవరి  23(ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు(సోమవారం) అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లా, నిర్మల్ జిల్లాల్లో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లగా, విద్యుత్ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. కాళేశ్వరంలో వడగళ్ల వాన బీభత్సం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాంతంలో వడగళ్ల వాన తీవ్రంగా కురిసింది....