తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు హైదరాబాద్ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మార్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఆదేశించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడిటెడ్ జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలు, సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చని పేర్కొంది.ఈ పిటిషన్‌లో, జీఓ 252, సవరించిన జీఓ 103...