దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్:వడ్డేపల్లి రామచందర్
-నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్
కోదాడ ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ స్పష్టం చేశారు. సోమవారం కోదాడ పట్టణంలో ఇటీవల పోలీసు లాక్ అప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ తల్లి లలితమ్మతో రాజేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ నుంచి మంజూరైన పెన్షన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ నందలాల్ పవర్,అడిషనల్ డీజీ చౌహన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సమక్షంలో అందజేశారు. అనంతరం కోదాడ ఆర్డీవో కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కేసు వివరాలను అధికారులతో దర్యాప్తు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కర్ల రాజేష్ కేసు పత్రికల్లో చూసి ఎస్సీ కమిషన్ సుమోటో కింద కేసు నమోదు చేసిందన్నారు. కమిషన్ కేసులో ప్రవేశించిన అనంతరం ఎస్ఐఆర్ చేశారని అంతకుముందు జరగలేదన్నారు. రాజేష్ మృతి పై నేటి వరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో బాధ్యులైన సిఐని సస్పెండ్ చేయడమే కాదు. ఎస్సెని వారం రోజుల్లో సస్పెండ్ చేయాలని అడిషనల్ డీజ్, జిల్లా ఎస్పీని ఆదేశించారు. పది రోజుల్లో రీ పోస్టుమార్టం చేసి నివేదికను అందించాలని ఆదేశించారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సెక్షన్ 4 ప్రకారం కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు జవాబు ఇవ్వకపోతే నిర్లక్ష్యపు చట్టం ప్రకారం సస్పెన్షన్ తో పాటు ఆరు నెలలు ఉంటుందని హెచ్చరించారు. రాజేష్ తల్లికి మూడు రోజుల్లో ఉద్యోగం, పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడు ఎకరాల భూమి ఆరు నెలల్లో ఇచ్చేందుకు కలెక్టర్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, అడిషనల్ డీజీ చౌహన్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పవర్, ఎస్పీ నరసింహ, ఆర్డీవో సూర్యనారాయణ, డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి దయానంద రాణి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ 34 వ వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీను, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు యలమర్తి రాము, కొండపల్లి ఆంజనేయులు, వడ్డేపల్లి కోటేష్, యాతాకుల రాజన్న, కుడుముల శ్రీను, ఏపూరి సత్యరాజు,పిడమర్తి వెంకట్రావు బిజెపి నుండి నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, అంజి యాదవ్, బచ్చలకూరి ప్రసాద్, చింత్రాల బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.