దామరదిద్ద లో యతేచ్ఛగా మట్టి దందా
చేవెళ్ల ఫ్రిబవరి 22(ప్రజాక్షేత్రం):చేవెళ్ల మున్సిపాలిటీ, మండల పరిధిలలో ప్రభుత్వ భూములనుంచి అనుమతి లేకుండా మట్టిని యాత్తేచ్చగా తరలిస్తున్నారు.సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు చెప్పడంతో వ్యాపారులు ఇష్టరాజ్యంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దంధ కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దామరగిద్ద రెవిన్యూ పరిధిలోని 153సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా జేసీబి సహాయంతో తీసిన మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దామరగిద్ద రెవిన్యూ లో తవ్వ కాలు చేసి బస్తేపూర్ శివారులో కొత్తగా ఏర్పాటు చేసిన ఫామ్ ల్యాండ్ వెంచర్ కు మట్టిని తరలిస్తున్నారు. ఈ తతంగామంతా రాత్రి పూట, అధికారులు అందుబాటులోలేని శని, ఆదివారాలలో జోరుగా సాగుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇష్టరాజ్యాంగ మట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఆదయానికి గండి పడుతుందని,తవ్విన ప్రదేశాలలో ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయని, స్థానికులు ఆందోళన చెండుతున్నారు. స్థానికుల నుంచి అధికారులకు పిర్యాదులు అందినప్పుడు నామమాత్రంగా తనిఖీ చేస్తున్నారని పట్టబడ్డ ట్రాక్టర్లను రాజకీయ ఒత్తిడి కారణంగా వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దింతో ఇష్టరాజ్యంగా తవ్వకాలు జరుపుతూ అడ్డు అదుపు లేకుండా దందా సాగిస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని తనిఖీలు ముమ్మరం చేసి అక్రమంగా మట్టిని తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వపనులకే అనుమతి కావాలి ప్రభుత్వపనులకు మట్టి, కావాలంటేనే సంబంధిత అధికారుల అనుమతులు కావాల్సిఉంటుంది. అలాంటి రూల్స్ తమకేవి వర్తించవు అనే రీతిలో మట్టి మాఫియా కొనసాగుతుంది. రిపోర్టర్లు అడిగిన సమాధానానికి మేము ఇప్పటివరకు ఎప్పుడు ఎలాంటి పర్మిషన్ లు తీసుకోలేదు తీసుకోము ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి… రిపోర్టర్లు అయితే అక్కడే ఉండాలి ఇక్కడ రావద్దు. ఎన్నో రోజులుగా ఇలా మట్టి తవ్వకాలు జరుపుతున్నాం ఇప్పటికీ ఏ రిపోర్టర్ రాలేడు. మీరు ఎవరు చెప్తే వచ్చిండ్రు ఏ కులం మీది అంటూ బెదిరించిన ట్రాక్టర్ యజమాని బోడ దావీదు ( దామోదర్ )
మట్టి తరలిస్తున్న వాహనల నెంబర్లు ఇలా ఉన్నాయి.
JCB TS 27 F 8819
ట్రాక్టర్ AP15 AE 1817
ట్రాక్టర్ AP 28 T– 97
ఈ చివరి ట్రాక్టర్ నెంబర్ ఇంతవరకే కనిపిస్తుంది… ఈ ట్రాక్టర్ దామరగిద్ద గ్రామానికి చెందిన బోడ దావీదు ( దామోదర్ ) ది
అక్రమంగా తరలించే వారిపై చర్యలు తప్పవు
తహసీల్దార్ కృష్ణయ్య ప్రభుత్వభూములలో అక్రమంగా మట్టిని, మోరని తరలించకుండా చర్యలు తీసుకుంటాము.
అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
