నిజాలు తెలుసుకొని మాట్లాడాలి… లేకపోతే చర్యలు తప్పవు: సర్పంచ్ రాజసులోచన
- గ్రామ అభివృద్ధిని దెబ్బ చేసే తప్పుడు ప్రచారాలపై ఆవేదన
షాబాద్, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):పెద్దవేడు గ్రామంలో చిన్నచిన్న అంశాలను వక్రీకరించి కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరికాదని గ్రామ సర్పంచ్ చక్కటి రాజసులోచన స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
కొంతమంది వ్యక్తులు ఇచ్చిన తప్పుదోవ పట్టించే సమాచారంపై ఆధారపడి ప్రచారం చేయడం పూర్తిగా తప్పని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి కథనాలు గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. గ్రామ అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేస్తున్న తమపై కావాలనే ఆరోపణలు చేయడం వెనుక కుట్ర ఉందని సర్పంచ్ రాజసులోచన ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి మీడియాకుందని పేర్కొంటూ, వాస్తవాలను పరిశీలించి గ్రామ సమస్యలపై నేరుగా తమను సంప్రదిస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవిందర్ నాయక్, వార్డు సభ్యులు పవన్ గౌడ్, సంధ్య రెడ్డి, బొప్పి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు అశోక్, రవి కుమార్, రాజు రఘుపతి రెడ్డి, రాఘవేందర్, వీరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, నరేష్, యాదయ్య, మధుకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
