పెద్దపల్లిలో ఏసీబీ దాడి: లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు
పెద్దపల్లిలో ఏసీబీ దాడి: లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం వ్యవహారం వెలుగుచూసింది. మంథనిలో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న కాసర్ల రాజేందర్ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఫిర్యాదుదారుడి వద్ద నుంచి రూ.16,500 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫైల్‌ను ముందుకు పంపేందుకు, ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ అయిన రషీద్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రంగంలోకి...