అక్రెడిటేషన్ల గడువు మరో నెల పొడిగిస్తాం:మంత్రి పొంగులేటి

అక్రెడిటేషన్ల గడువు మరో నెల పొడిగిస్తాం.. - దరఖాస్తు ప్రక్రియ సరళతరం చేస్తాం. - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 22(ప్రజాక్షేత్రం):పాత్రికేయ సంఘాల ప్రతిపాదన మేరకే అక్రెడిటేషన్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించేలోపు మరో నెలపాటు అక్రెడిటేషన్‌ కార్డుల గడువును పొడిగిస్తామని తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్‌, వెబ్‌సైట్‌ జర్నలిస్టులు, కేబుల్ చానల్స్, చిన్న...