పోస్టుమార్టం నివేదికకు వెల కట్టిన హోంగార్డ్
పోస్టుమార్టం నివేదికకు వెల కట్టిన హోంగార్డ్ కీసర, ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో లంచం వ్యవహారం వెలుగుచూసింది. పోస్ట్మార్టం నివేదిక ఇప్పిస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన హోంగార్డ్ నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తోటకూరు మహేశ్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోస్ట్మార్టం నివేదిక కోసం నగేష్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో పరిచయం ఉన్న సందీప్ పేరును ప్రస్తావిస్తూ రిపోర్ట్ కావాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని...