prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 10:35 am Digital Edition : PRAJA KSHETRAM

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఉద్యోగం ఊడినట్లే!

ప్రభుత్వ ఉద్యోగులారా..బీ అలర్ట్!

 

– ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఉద్యోగం ఊడినట్లే!

– ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు..

ప్రచార ఫోటోలో ఒక్క ఫోటో దొరికిన ఇంతే సంగతులు..

హైదరాబాద్ ఫిబ్రవరి 01(ప్రజాక్షేత్రం):మున్సిపల్ ఎన్నికల ప్రచారం రెండు రోజుల్లో జోరందుకొంటుంది.ఈ సమయంలో,ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల సభల్లో,ప్రచారాల్లో పాల్గొంటున్నారా?వాట్సాప్,ఫేస్‌బుక్‌లలో ఫలానా పార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారా?తస్మాత్ జాగ్రత్త!మీ ఉద్యోగం ప్రమాదంలో పడినట్లే!పుర పోరు నేపథ్యంలో..తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(TSEC)ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే,వేటు వేయడానికి కూడావెనుకాడబోమని స్పష్టం చేసింది.._