బాన్సువాడ లో జోరుగా ప్రచారాలు చేస్తున్న పలు పార్టీ నాయకులు

బాన్సువాడ లో జోరుగా ప్రచారాలు చేస్తున్న పలు పార్టీ నాయకులు నెగ్గిదెవరు గెలిచేది ఎవరు అవ్వ అమ్మ తాత అంటూ ఆకట్టుకునే యత్నం ఎన్నికల పోరు… ప్రచార జోరు. కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05(ప్రజాక్షేత్రం):బాన్సువాడ పట్టణంలో పురపాలక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. బాన్సువాడ మున్సిపాలిటీలో బుధవారం నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రచార రంగంలోకి దిగడంతో వార్డులన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రంగంలోకి ముఖ్యనేతలు… ప్రచార రథాలు,బైకులు,ఆటోలు, పార్టీ బ్యానర్లు.. ఇలా ప్రతి వీధిలోనూ నినాదాల ప్రతిధ్వని వినిపిస్తోంది.కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ...