prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 6:01 pm Digital Edition : PRAJA KSHETRAM

బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అవమానం!

బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అవమానం!

శంకర్ పల్లి ఫిబ్రవరి 19(ప్రజాక్షేత్రం):మియాఖాన్ గడ్డ గ్రామంలో జరిగిన నీచమైన ఘటన అమానుషం. గత ఏడాది కాలంగా బస్టాప్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఫ్లెక్సీని, బుధవారం రాత్రి 11:00 గంటల సమయంలో పురం వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చింపి అవమానించినట్లు బలమైన అనుమానం ఉంది. ​ఇది కేవలం ఒక ఫ్లెక్సీని చింపడం కాదు ​గ్రామంలో కుల విద్వేషాలను కావాలనే రెచ్చగొట్టే కుట్ర! ​రాజ్యాంగ నిర్మాతను అవమానించడం ద్వారా మా జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే! ​ఈ ఘటనపై మొకిలా పోలీస్ స్టేషన్‌లో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం మరియు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు యంత్రాంగం తక్షణమే విచారణ జరిపి, అనుమానితుడైన పురం వెంకట్ రెడ్డిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు పాల్పడే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.