భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా అనురాగ్ జయంతి
వలిగొండ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కలెక్టర్గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. ప్రస్తుతం అనురాగ్ జయంతి జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. హనుమంతరావు బదిలీతో అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. పలువురు అధికారులు, ప్రముఖులు నూతన కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేశారు.