మొయినాబాద్‌లో చైర్మన్ కుర్చీ కోసం రాజకీయ కిడ్నాప్?

మొయినాబాద్‌లో చైర్మన్ కుర్చీ కోసం రాజకీయ కిడ్నాప్? -హంగ్ ఫలితాల తర్వాత అడ్డదారి రాజకీయాలు ఆరోపణ -బీఆర్‌ఎస్ నాయకుడు అల్లం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేవెళ్ళ ఫిబ్రవరి 14(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో చైర్మన్ పదవి కోసం రాజకీయ పావులు కదులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో అడ్డదారులు తొక్కుతోందని బీఆర్‌ఎస్ నాయకుడు అల్లం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చైర్మన్ కుర్చీ కోసం బీఆర్‌ఎస్ నుండి గెలిచిన కౌన్సిలర్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకులు...