నారాయణ స్కూల్ బస్సు, టిప్పర్ ఢీ
- స్వల్ప గాయలతో బయట పడిన విద్యార్థులు.
- పరారిలో స్కూల్ బస్సు డ్రైవర్.
శంకర్ పల్లి, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా మోకిలా గ్రామ పరిధిలో శుక్రవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నారాయణ స్కూల్ కు చెందిన స్కూల్ బస్సు శంకర్‌పల్లి మండలంలోని మోకిల్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం స్థానికుల కథనం ప్రకారం, సాధారణంగా ప్రతిరోజూ బస్సును నడిపే డ్రైవర్ స్థానంలో ఈరోజు అతని కుమారుడు వాహనం నడిపినట్లు తెలుస్తోంది. అనుభవం లేకపోవడం లేదా వేగం నియంత్రణలో లోపం కారణంగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. “ఈ ప్రమాదానికి డ్రైవర్ కొడుకే ప్రధాన కారణం” అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలే అయినప్పటికీ, మరికొందరికి చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవింగ్‌కు అనుమతులు, లైసెన్స్ వివరాలు, వాహనం పరిస్థితి తదితర అంశాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అనుభవం ఉన్న డ్రైవర్లనే నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
