prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 6:22 pm Digital Edition : PRAJA KSHETRAM

యూనివర్సిటీలో చికెన్ కోసం గొడవ.. కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు

యూనివర్సిటీలో చికెన్ కోసం గొడవ.. కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు

– చికెన్ పంపకాలకు సంబంధించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ

– పరస్పరం కర్రలతో దాడి చేసుకున్న విద్యార్థులు

– కేయూలోని ఎంబీఏ, ఎకనమిక్స్ ఫస్టియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ

హన్మకొండ ఫిబ్రవరి 23(ప్రజాక్షేత్రం):హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నిన్న లంచ్ తర్వాత చికెన్ మిగిలిపోయింది. ఈ చికెన్ పంపకాలలో రెండు గ్రూపుల మధ్య గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంబీఏ ఫస్టియర్, ఎకనమిక్స్ ఫస్టియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాటా మాటా పెరిగి కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కొందరు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది.