లొంగుబాటలో దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి

లొంగుబాటలో దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి - తెలంగాణ పోలీసుల అదుపులో ఇద్దరు - సంచలనంగా మారిన లొంగుబాటు - డీజీపి ప్రకటనలో అంతర్యమిదేనా? తెలంగాణ బ్యూరో ఫిబ్రవరి 22(ప్రజాక్షేత్రం):మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అటవీప్రాంతం నుంచి తెలంగాణ స్పెషల్ ఇంటెలీజెన్స్ వర్గాల అదుపులోకి ఈ ఇద్దరు నేతలు వెళ్ళినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు...