వనపర్తి అభివృద్ధికి వారానికో వార్డు పర్యటన.
వనపర్తి అభివృద్ధికి వారానికో వార్డు పర్యటన. రూ.54 కోట్ల తో సీసీ రోడ్లు, 2000 ఇందిరమ్మ ఇళ్లు. అవినీతికి తావులేకుండా అభివృద్ధి. మరో 50 కోట్లు మంజూరు కు కృషి. మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. వనపర్తి, ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):వనపర్తి పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని, వారానికి ఒక వార్డు చొప్పున సందర్శించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం...