prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 5:51 pm Digital Edition : PRAJA KSHETRAM

షాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి

షాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి

-ప్రైవేటు వ్యక్తి ద్వారా డబ్బులు వసూలు

-రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి గోసలు పట్టించుకునే నాథుడులేడా?

-భూముల రిజిస్ట్రేషన్లు సాయంత్రం 7:30 వరకు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల తాసిల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి చోటుచేసుకుంది. షాబాద్ మండలం మారుమూల గ్రామాల ప్రజలు తమ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి షాబాద్ మండల తాసిల్దార్ కార్యాలయానికి వస్తుంటారు, కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తులను బయటకు పిలిపించుకొని, తాసిల్దార్ కు, డిప్యూటీ తాసిల్దార్ కు, డబ్బులు ఇవ్వాలని బేరాన్ని మొదలు పెడుతున్నారు. ఈ బేరాన్ని మొదలు పెట్టే వ్యక్తి కే మల్లేష్ అనే వ్యక్తిని ప్రైవేట్ గా షాబాద్ అధికారులు నియమించారు. దీంతో ప్రతిరోజు రెండు చేతులు డబ్బులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల షాబాద్ మారుమూల గ్రామాల నుండి ఉన్న భూములు హైదరాబాద్ వారివే, ఎక్కువ అని చెప్పాలి అయితే ప్రతిరోజు రిజిస్ట్రేషన్ నిమిత్తం షాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వస్తుంటారు. అయితే ఈ ప్రైవేట్ వ్యక్తి కి మల్లేష్ వారికి ఫోన్ చేసి తాసిల్దార్ కు మరియు, డిప్యూటీ, తహసీల్దార్ కు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అని చెప్పి రోజు వేల కొలదిరూపాయలు వసూలు చేస్తున్నారని భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా లబ్ధిదారుల నుండి వసూలు చేస్తున్నారని రైతులు బోరున విలపిస్తున్నారు. మంగళవారం ప్రజాక్షేత్రం విలేకరికి ఈ తతంగం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిరోజు హైదరాబాదు నుండి తమ భూములను లావాదేవీలు జరుగుతున్నప్పటికీ అట్టి భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి షాబాద్ తాసిల్దార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం ప్రజలు వస్తుంటారు. అటు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కే మల్లేష్ అనే వ్యక్తి వెళ్లి అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి వేలకొలది రూపాయలు వారి వద్ద నుండి వసూలు చేస్తున్నట్లు సమాచారం ద్వారా తెలిసింది. ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను, డబ్బులు వసూలు చేసే ప్రైవేటు వ్యక్తికి మల్లేష్ ను విధుల నుండి తొలగించాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయా గ్రామాల రైతులు హైదరాబాద్ భూ యజమానులు పేర్కొన్నారు.

అధికారులను బదిలీ చేయండి.

ఇటీవల షాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై గతంలో పత్రికలో ప్రచురితమైనప్పటికీ అధికారులు ఏమాత్రం చలనం చూపకపోవడంతో వారిని వెంటనే బదిలీ చేయాలని షాబాద్ మండల రైతులు మరియు హైదరాబాద్ నుండి వచ్చే రిజిస్ట్రేషన్ బాధితులు జిల్లా అధికారులను కోరుతున్నారు. అధికారులు ఈ విధంగా దోపిడి చేస్తే ఎలా తట్టుకోవాలి నెత్తి పట్టుకుంటున్నారు. నిజానికి రెవెన్యూ కార్యాలయంలో కొన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారులను బదిలీ చేస్తే తప్ప నూతనంగా వచ్చి అధికారి అయిన తమ పనులకు విముక్తి కలిగిస్తారని మండల మారుమూల గ్రామాల రైతులు జిల్లా అధికారులను కోరుతున్నారు.