prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 5:39 pm Digital Edition : PRAJA KSHETRAM

సిద్దిపేట జిల్లాలో దారుణం..కాంగ్రెస్‌ నేత మర్డర్‌

సిద్దిపేట జిల్లాలో దారుణం..కాంగ్రెస్‌ నేత మర్డర్‌

సిద్దిపేట ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధి చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఆయనను రాజక్క పేట గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాల్ రెడ్డి పై దాడి చేసి హత్య చేయడంతో పాత కక్ష్యలు ఏమన్నా ఉన్నాయా; లేక భూ తగాదాలు కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. బాల్ రెడ్డికి ఎవరైన శత్రువులు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన విషయం స్థానికులకు తెలవడంతో పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన విధానాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాల్ రెడ్డి హత్య దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.