prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 5:47 pm Digital Edition : PRAJA KSHETRAM

21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

– రుతువుల మార్పిడితో కురిసే అవకాశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 22న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా ఉరుములు, మెరుపులతో గాలివానలు బీభత్సం సృష్టించే అవకాశాలున్నట్టు తె లిపింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని, నె లాఖరు వరకు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.