prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 6:19 pm Digital Edition : PRAJA KSHETRAM

ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ వార్షికోత్సవ వేడుకలు

ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ వార్షికోత్సవ వేడుకలు

బంగారుపాళ్యం మార్చి 28(ప్రజాక్షేత్రం):ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ సంస్థ యొక్క మొదటి వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 29వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో నిర్వహించనున్నట్లు (ఆర్టీఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో పాటు వివిధ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా మరియు మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులతో పాటు సమాచార హక్కు చట్టం గూర్చి తెలుసుకోవాలని ఉన్న వారు ఎవరైనా తప్పనిసరిగా హాజరు కావచ్చు మరియు స్వచ్ఛందంగా సంస్థ లో ఎవరైనా చేరాలంటే చేరవచ్చును ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సంస్థ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించి పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ్యులు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.