prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 4:48 pm Digital Edition : PRAJA KSHETRAM

ఉచిత చర్మ, జుట్టు వ్యాధి వైద్య శిబిరం

ఉచిత చర్మ, జుట్టు వ్యాధి వైద్య శిబిరం

  • సాన్స్ స్కిన్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ హాస్పిటల్
  • శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఆధ్వర్యంలో

శంకర్‌పల్లి మార్చి 23(ప్రజాక్షేత్రం):ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డా. సాయిసింధు అన్నారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్ శివారులో గల సాన్స్ స్కిన్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ హాస్పిటల్ ఉచిత చర్మ జుట్టు వ్యాధి వైద్య శిబిరం సోమవారం చందిప్ప గ్రామంలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత డెర్మటాలజీ వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ నేడు మన తీసుకునే ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వలన ప్రతి ఒక్కరు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో స్కిన్ పట్ల నిర్లక్షం వద్దని, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైద్యుల సూచనలు తప్పకుండ పాటించి మందులు వాడితే వ్యాధులు నయం అవుతాయని ఆమె చెప్పారు. ఈ శిబిరంలో 86 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం మరకత శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి డా. సాయి సింధును స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ శేఖర్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, కమిటీ సభ్యులు హన్మంతు, శ్రీనివాస్, ఆలయ అర్చకులు సాయిశివ, ప్రమోద్, వీరేష్, శ్రీనివాస్ ఉన్నారు.