ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్ తప్పదా…?
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్ తప్పదా…? పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు ఆందోళనకు దిగుతున్నారు. తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని వ్యాపారులు తీవ్ర ఆవేదన లో ఉన్నారు. వ్యాపారం నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.చికెన్ ధరలు పెరిగినా, మధ్యవర్తుల విధానాల వల్ల తాము లాభపడడం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ సమస్యలను పౌల్ట్రీ...