prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 6:13 pm Digital Edition : PRAJA KSHETRAM

కల్తీ మిక్చర్, బిస్కెట్లు తయారీ ముఠా – గుట్టురట్టు ముగ్గురు నిందితుల అరెస్ట్

కల్తీ మిక్చర్, బిస్కెట్లు తయారీ ముఠా – గుట్టురట్టు ముగ్గురు నిందితుల అరెస్ట్

రాజేంద్రనగర్, మార్చి 28(ప్రజాక్షేత్రం):మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో కల్తీ మిక్చర్, బిస్కట్లు మరియు చిక్కీలు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు శనివారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం ఇలా… రాజేంద్రనగర్ అత్తాపూర్ సర్కిల్ బాబుల్ రెడ్డి నగర్ , లక్ష్మిగూడ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారంతో దీనిపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు , హై ఫాస్ట్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, హానికరమైన రంగులు, రసాయనాలను జోడించి తయారు చేసిన ఈ కల్తీ ఉత్పత్తులను హైదరాబాద్‌లోని వివిధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ దాడులలో దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం..మున్నీరు అరుణ్ కుమార్ ఫుడ్ కంపెనీ’ పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా, రసాయనాలను వాడుతూ మిక్చర్ తయారు చేస్తున్నాడు. పోలీసుల దాడుల్లో భారీగా కల్తీ ఆహార పదార్థాలు , అరుణ్ కుమార్ ఫుడ్స్ 99 కాటన్ బాక్సుల మిక్చర్ ప్యాకెట్లు, 25 కిలోల పల్లీ బ్యాగులు, టాల్క్ పౌడర్, బెల్లం మరియు చిక్కీల జైన్ ఫుడ్స్ మక్కా చుడ్వా, పాపిడి, లాల్ సేవ్, సాబుదానా, ఘాటియా, బనానా చిప్స్, నమక్ పోహా, వివిధ రకాల మిక్చర్లు, 50 కిలోల స్వీట్ పేటా, వాడేసిన వంట నూనె మరియు సోడియం హైడ్రోసల్ఫైట్అంజని ఫుడ్స్, బఠాణీ మిక్చర్, మసాలా పల్లీ, రెడ్ కలర్ స్టిక్స్, చాట్ పట్ మసాలా , నిషిద్ధ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్స్ స్వాధీనం చేసుకున్న సొత్తు (విలువ సుమారు రూ. 3,35,100/-) పోలీసుల దాడుల్లో భారీగా కల్తీ ఆహార పదార్థాలు , ముడి సరుకులు లభ్యమయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన మున్నీర్ అరుణ్ కుమార్ (34), శ్రీరామ్ కాలనీ, జల్పల్లి, బాలాపూర్ మండలం. (అరుణ్ కుమార్ ఫుడ్స్)వుండ్యాల మస్తాన్ రెడ్డి (46), నివాసం: వెంకటేశ్వర కాలనీ, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి. (అంజని ఫుడ్స్) విశాల్ జైన్ (41), నెహ్రూ నగర్, హైదరాబాద్. (జైన్ ఫుడ్స్) నిందితులను అరెస్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.