కల్తీ మిక్చర్, బిస్కెట్లు తయారీ ముఠా – గుట్టురట్టు ముగ్గురు నిందితుల అరెస్ట్
కల్తీ మిక్చర్, బిస్కెట్లు తయారీ ముఠా - గుట్టురట్టు ముగ్గురు నిందితుల అరెస్ట్ రాజేంద్రనగర్, మార్చి 28(ప్రజాక్షేత్రం):మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో కల్తీ మిక్చర్, బిస్కట్లు మరియు చిక్కీలు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు శనివారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం ఇలా… రాజేంద్రనగర్ అత్తాపూర్ సర్కిల్ బాబుల్ రెడ్డి నగర్ , లక్ష్మిగూడ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ...