కొంపల్లి–దూలపల్లిలో నామమాత్రపు కూల్చివేతలు…టౌన్ ప్లానింగ్ పై స్థానికుల ఆగ్రహం

కొంపల్లి–దూలపల్లిలో నామమాత్రపు కూల్చివేతలు…టౌన్ ప్లానింగ్ పై స్థానికుల ఆగ్రహం చిన్న షెడ్లపై ప్రతాపం…భారీ అక్రమ నిర్మాణాలపై మౌనం? కూల్చామా అన్నట్టే కూల్చివేతలు…అధికారుల తీరుపై అనుమానాలు? కుత్బుల్లాపూర్, మార్చి 09(ప్రజాక్షేత్రం):కొంపల్లి సర్కిల్ పరిధిలోని కొంపల్లి మరియు దూలపల్లి ప్రాంతాల్లో సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టిన కూల్చివేతలపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు కొన్ని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టినప్పటికీ, అవి కేవలం నామమాత్రపు కూల్చివేతలుగా మాత్రమే మిగిలిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం...