ఖగోళ శాస్త్ర అద్భుతం… సంపూర్ణ చంద్రగ్రహణం
-చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో బ్లడ్ మూన్ గా సాక్షాత్కారం
హైదరాబాద్ మార్చి 03(ప్రజాక్షేత్రం):ఖగోళ శాస్త్ర అద్భుతంగా సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది. శాస్త్రవేత్తలకి కాకుండా సామాన్యులకు కూడా ఈ చంద్రగ్రహణం ఒక అద్భుత దృశ్యమే. బ్లడ్ మూన్ గా పిలువబడుతున్న ఈరోజటి చంద్రగ్రహణం భారతదేశంలో సహా ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రంలో బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపించగా, మనదేశంలో కోల్ కత్తా, గౌహతి తూర్పు ప్రాంతాల్లో ఎర్రటి సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తిగా కనిపించింది. హైదరాబాద్ ఢిల్లీ ముంబై వంటి నగరాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడు పై పూర్తిగా కమ్మేసినప్పుడు సూర్య రష్మీ నేరుగా చంద్రుడిపై పడనందువల్ల భూ వాతావరణ నుంచి ప్రయాణించే సూర్యకాంతి లోని ఎరుపు రంగు కిరణాలు చంద్రుడిపై పడినప్పుడు చంద్రుడు ఎరుపువర్ణంలోకి మారడాన్ని బ్లడ్ మూన్ గా పిలుస్తారు. కనులవిందుగా కనిపించే ఈ అద్భుత దృశ్యాన్ని అందరూ చూడాల్సిందే.