ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం మేడ్చల్ మల్కాజిగిరి, మార్చి 27(ప్రజాక్షేత్రం):శ్రీరామ నవమి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా, నాగారం, కీసర, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పూలతో, విద్యుత్‌ దీపాలతో ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయ పద్ధతిలో కళ్యాణ వేడుకలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి, అనంతరం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. మంగళ...