చెరువులో పడి గురుకుల విద్యార్థి గల్లంతు
- రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
షాద్ నగర్ మార్చి 03(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాద్ నగర్
పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల వసతి గృహంలో చదువుతున్న రాజు అనే విద్యార్థి చెరువులో గల్లంతయ్యాడు.
గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు, షాద్ నగర్ పరిధిలోని నేషనల్ హైవే సమీపంలోని గురుకుల వసతి గృహంలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా సెలవు ఉండడంతో, అతను మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఫరూక్ నగర్ మండలం రాయికల్ శివారులో ఉన్న చెరువుకు ఈత కొట్టడానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో చెరువులోకి దిగిన రాజు తిరిగి బయటకు రాకపోవడంతో సహ విద్యార్థులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థి కోసం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.