జీనెక్స్ సీడ్స్ కంపెనీ సోల్జర్ 888తో అధిక దిగుబడులు..
- తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..
- లంబాడిపల్లె క్షేత్ర ప్రదర్శనలో కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ రాజశేఖర్ వెల్లడి..
- వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున హాజరైన రైతన్నలు..
చిగురుమామిడి, మార్చి 29(ప్రజాక్షేత్రం):జినేక్స్ సీడ్స్ కంపెనీ సోల్జర్ 888 మొక్కజొన్న విత్తనాలతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆ కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామ శివారులో బరిగెల స్వప్న రవీందర్ అనే రైతు వేసిన మొక్కజొన్న పంట క్షేత్ర ప్రదర్శనను ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ జినేక్స్ సీడ్స్ కంపెనీ సోల్జర్888 మొక్కజొన్న అన్ని రకాల రోగాలను తట్టుకునే గుణం కలదని, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందన్నారు. పొడువు అయినా గుండ్రటి కంకితో అధిక వరుసలు కలిగి ఉంటుందని, విత్తనాలు అధిక బరువు ఉంటాయని రైతులకు వివరించారు. గాలి వానలకు సైతం పడిపోకుండా తట్టుకోని నిలబడగలిగే శక్తి ఈ కంపెనీ సీడ్ కు ఉందని తెలిపారు. ఖరీఫ్, రబీ రెండు సీజన్ లో ఈ మొక్కజొన్నను రైతులు వేసుకొని అధిక లాభాలు పొందాలని, కేవలం 120రోజులకు పంట చేతికి వస్తుందనిరైతులకు వివరించారు. అనంతరం రైతు స్వప్నను శాలువా కప్పి ఘనంగా సన్మానించి, కూల్ వాటర్ క్యాన్ ను అందజేసి అభినందించారు.జినెక్స్ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ చిగురుమామిడి శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ అవునూరి సతీష్ మాట్లాడుతూ మొక్కజొన్న సాగులో అధిక దిగుబడుల కోసం జినేక్స్ సీడ్స్ కంపెనీ సోల్జర్ 888 ను రైతులు ఎంపిక చేసుకోవాలని,ఎకరాకు 38నుండి 42క్వింటాళ్ల దిగుబడి వస్తుందని సతీష్ తెలిపారు.ఈ మొక్కజొన్న పంట క్షేత్ర ప్రదర్శన కార్యక్రమానికి లంబడిపల్లె, పీచుపల్లె సీతారాంపూర్, చిగురుమామిడి తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కంపెనీ అధికార ప్రధానిధి ఏరియా సేల్స్ మేనేజర్ రాజశేఖర్, ఫీల్డ్ స్టాఫ్ శివ కుమార్, జినెక్స్ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ చిగురుమామిడి శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ అవునూరి సతీష్, రైతులు తేలు వెంకన్న యాదవ్, యాళ్ల జనార్దన్ రెడ్డి, చందబోయిన రాజు, ఐరెడ్డి భగవాన్ రెడ్డి, కయ్యం వీరన్న, రైతులు పాల్గొన్నారు.