prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 5:16 pm Digital Edition : PRAJA KSHETRAM

తాగే నీరు కలుషితమైతే…. మరి తాగేది ఎలా

తాగే నీరు కలుషితమైతే…. మరి తాగేది ఎలా

రాజేంద్రనగర్, మార్చి 13(ప్రజాక్షేత్రం):తాగే నీరు కలుషితమైతే మరి తాగేది ఎలాగని హిమాయత్ సాగర్ బస్తివాసులు అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కలుషిత నీరు సరఫరా అయింది, కొన్ని రోజుల నుండి ఈ విషయంపై సంబంధిత అధికారులకు సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని దగ్గరలో ఉన్న ఫిల్టర్ షెడ్ ప్రాంతానికి స్థానికులు భారీగా చేరుకొని తమ సమస్యలను చెబుతున్నా ఎవరు పట్టించుకోవడంలేదని జలమండలి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారితో వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడంతో నీరు రంగు మారి ఉండవచ్చని మాట్లాడారు. ఎక్కడైనా పైప్ లీకేజీ జరిగితే తక్షణమే మరమ్మత్తులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని అధికారి తెలిపారు. సమస్యను పరిష్కారం కాకపోతే కలెక్టర్ను ముట్టడిస్తామని స్థానికులు అధికారులకు హెచ్చరించారు.