prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 6:29 pm Digital Edition : PRAJA KSHETRAM

తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్ మార్చి 05(ప్రజాక్షేత్రం):తెలంగాణ గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాను మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పులో భాగంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన ఈ నియామకాలు తక్షణమే అమలులోకి రానున్నాయి. కొత్త గవర్నర్గా రానున్న శుక్లాకు రాష్ట్ర ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.