prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 7:48 pm Digital Edition : PRAJA KSHETRAM

దావత్‌లకు సంబంధం లేని వ్యక్తులు వస్తే 3 నెలల జైలు శిక్ష, రూ.5000 జరిమానా

దావత్‌లకు సంబంధం లేని వ్యక్తులు వస్తే 3 నెలల జైలు శిక్ష, రూ.5000 జరిమానా

-పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష…

మహబూబాబాద్ మార్చి 09(ప్రజాక్షేత్రం):ఆహ్వానం లేకుండా ఫంక్షన్కు రావొద్దని ఓ ఫంక్షన్ హాల్ ముందు యజమాని బోర్డు పెట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కనిపించింది. ఫంక్షన్ హాల్లో జరిగే ప్రోగ్రాంలకు ఆహ్వానం లేకుండా కొందరు వస్తుండడంతో హాల్లో ఫంక్షన్లు చేయక గిరాకీ తగ్గిందని సదరు యజమాని తెలిపాడు. దీన్ని నివారించేందుకే ఫంక్షన్ హాల్ ఎదుట.. ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3నెలల జైలు శిక్ష రూ.5,000 జరిమానా విధిస్తామని బోర్డు పెట్టారు.