దేశంలో నియోజకవర్గాల పునర్విభజన.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సీట్లు
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సీట్లు నేషనల్ బ్యూరో మార్చి 23(ప్రజాక్షేత్రం):దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ పునర్విభజన చేపట్టాలని నిర్ణయించింది. దీనితోపాటే, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని కూడా ఇదే ప్రాతిపదికన అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన...