నాగారం డివిజన్‌లో నిర్మాణ నిబంధనలు గాలికి
నాగారం డివిజన్‌లో నిర్మాణ నిబంధనలు గాలికి జీ+2 అనుమతితో జీ+2+ఫెంట్ హౌజ్ నిర్మాణాలు … నాగారం డివిజన్‌లో చెలరేగుతున్న అక్రమ కట్టడాలు నాగారం, మార్చి 16(ప్రజాక్షేత్రం):మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్‌లోని నాగారం డివిజన్‌లో అనుమతులకు మించి నిర్మాణాలు విస్తరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీ+2 వరకు మాత్రమే అనుమతి తీసుకున్న కొందరు నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్రౌండ్ ప్లస్ రెండ్ ఫ్లోర్లు ప్లస్ ఫెంట్ హౌజ్‌లతో భవనాలను నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నప్పటికీ...