నాగారం శ్మశానంలో నిబంధనల ఉల్లంఘన
నాగారం శ్మశానంలో నిబంధనల ఉల్లంఘన సమయానికి విరుద్ధంగా దహనాలు.. స్థానికుల్లో ఆందోళన నాగారం, మార్చి 21(ప్రజాక్షేత్రం):ఘట్‌కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ పరిధిలోని గోపి కృష్ణ కాలనీ సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో నిబంధనలు పట్టించుకోకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత దహన సంస్కారాలు నిర్వహించరాదని ఉన్నప్పటికీ, కొందరు బాధ్యులు లంచాల కోసం నిబంధనలను అతిక్రమిస్తూ రాత్రి వేళల్లో కూడా దహనాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాలనీవాసులు పలుమార్లు అభ్యంతరం...