నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, గొంతుకోసి హత్య

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, గొంతుకోసి హత్య రాజేంద్రనగర్, మార్చి 16(ప్రజాక్షేత్రం):నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ క్యాంపులో నివసించే ఒక వలస కూలీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటూ కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారిని ఓ కామాంధుడు పొట్టనబెట్టుకున్నాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, అత్యంత క్రూరంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నార్సింగి పరిధిలోని వివిధ నిర్మాణ రంగ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులు ఇక్కడి లేబర్ క్యాంపుల్లో నివసిస్తున్నారు....