prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 7:27 pm Digital Edition : PRAJA KSHETRAM

పోలీసులకే ఆదర్శం ఈ సీఐ

పోలీసులకే ఆదర్శం ఈ సీఐ

  • ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ
  • ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు
  • ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో ముందంజ
  • ఆయనే వికారాబాద్ సిఐ రఘు కుమార్

వికారాబాద్ బ్యూరో 30(ప్రజాక్షేత్రం):తాను ఎక్కడ పని చేసిన ప్రజా సమస్యని తన సమస్యగా పరిగణిస్తూ ప్రజల రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగడమే ఆయన ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లా నవపేట్ మండలం కేంద్రంలో జన్మించిన కె. రఘు కుమార్ ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖలో ఎస్సైగా జాయిన్ అయ్యారు. హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆయన షాద్నగర్లో ట్రాఫిక్ ఎస్సైగా పనిచేసిన ఆయన సిఐగా పదోన్నతి పొంది లంగరోజులో ఎస్ హెచ్ ఒగా పని చేశారు. ఈ ఏడాది జనవరి నెలలో వికారాబాద్ పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మధ్యాహ్నం చేసి వారికి చట్టంపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి బోనస్ను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రైల్వే గేట్ ల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్నది నా అక్కడ సిసి కెమెరా తో పాటు మైకులు ఏర్పడింది పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేశారు. ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడి నుంచి మైకు ద్వారా క్లియర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయని గుర్తించి ప్రజలు చైతన్యపరిచేందుకు అవగాహన ఏర్పాటు చేస్తున్నానని అని తెలిపారు. ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేవని ఫ్రెండ్లీ రాజకీయం ఉందన్నారు. గంజాయి డ్రగ్స్ ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఆటో ఏర్పాటుచేసి గల్లీ గల్లి తిప్పుతున్నామన్నారు. ప్రతి ఒక్కరు సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.