ప్రజాక్షేత్రం కథనంతో కదిలిన అధికారులు… ఎక్స్‌రే సేవలు పునరుద్ధరణ

ప్రజాక్షేత్రం కథనంతో కదిలిన అధికారులు… ఎక్స్‌రే సేవలు పునరుద్ధరణ స్కానింగ్ ప్రింట్ సమస్యపై గర్భిణీల ఆవేదన ఎక్స్‌రే సరి… స్కానింగ్ ప్రింట్ లేదు కుషాయిగూడ,మార్చి 9(ప్రజాక్షేత్రం):కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్‌రే యంత్రం పని చేయడం లేదని ఫిబ్రవరి 10న ప్రజా క్షేత్రంలో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. వెంటనే సాంకేతిక సిబ్బందిని పిలిపించి ఎక్స్‌రే యంత్రాన్ని మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం ఎక్స్‌రే సేవలు మళ్లీ అందుబాటులోకి రావడంతో రోగులకు ఉపశమనం కలిగింది. స్థానికులు కూడా సమస్యను త్వరగా పరిష్కరించినందుకు అధికారులను అభినందిస్తున్నారు....