ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

మంత్రి దామోదర రాజనర్సింహ శంకర్‌పల్లి మార్చి 17(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో వెలసిన 11వ శతాబ్దపు మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆలయ అర్చకులు సాయిశివ, ప్రమోద్, వీరేష్ ఆధ్వర్యంలో స్వామి వారికి, ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో చండీ హోమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వారి దయతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. పురాతన శివాలయాన్ని...