బుల్కపూర్ లో బండలా చెరువు కబ్జా -రైతులకు, పశువులకు తీవ్ర ఇబంధులు
శంకర్ పల్లి మార్చి 27(ప్రజాక్షేత్రం):బుల్కపూర్ గ్రామ పరిధిలో గౌటన్ భూమిని కొంత మంది కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించి, ఆ భూమిలో ఉన్న బండ రాలను చెరువును పూర్తిగా నల్ల మట్టితో పూడ్చివేసి చెరువు చుట్టు కడిలతో కంచ వేసి, దానిని పంట పోలంగా మార్చేశారు ఈ విషయం గురించి స్థానిక రైతులు ప్రశ్నించగా, కబ్జాదారులు బెదిరింపులకు దిగుతూ, ఇది నా ఇష్టం అడ్డొస్తే మీ భూములను కుడా కబ్జా చేస్తా, అంటు హెచ్చరించినట్లు రైతులు తెలిపారు. ఈ చెరువు మీద ఆధారపడి గ్రామంలోని పశువులు, గెద్దెలు, మేకలు గొర్రెలు, నీళ్లు తాగేవి. ప్రస్తుతం చెరువును పూడ్చివేయడంతో పశువులకు నీళ్లు దొరకక తీవ్ర ఇబందులు ఎదురవుతున్నాయి. గ్రామస్తులు రైతులు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చెరువును పునరుద్ధించాలన్ని కబ్జాదారులపై కఠిన చెర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.